2020-21 విద్యా సంవత్సరానికి సీటు కొరకు నేరుగా లేదా ఫోన్ ద్యారా సంప్రదించగలరు.

కౌన్సిలింగ్ షెడ్యూల్

24-05-2019 వ తేదీ నుండి జరుగు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. 

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సమయంలో సమకూరుచుకోవలసిన సర్టిఫికెట్స్ వివరములు

  1. పాలిసెట్‌ హాల్‌టికెట్‌
  2. పాలిసెట్‌ ర్యాంక్‌ కార్డ్‌
  3. పదవ తరగతి మార్కుల జాబితా
  4. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్‌ లేదా నివాస ధృవీకరణ పత్రము (మీ సేవా కేంద్రం నందు పొందవలెను).
  5. పదవ తరగతి బదిలీ సర్టిఫికెట్‌
  6. కుల ధృవీకరణ పత్రము (మీ సేవా కేంద్రం నందు పొందవలెను.)
  7. రేషన్‌ కార్డ్‌ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రము (మీ సేవా కేంద్రం నందు పొందవలెను.)
  8. విద్యార్ధి ఆధార్‌ కార్డు
  9. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియకు SC/ST విద్యార్థులు రూ. 400/- మరియు ఇతర కులముల వారు రూ. 700/- చెల్లించవలెను. 

గమనిక : పైన పేర్కొన్న సర్టిఫికెట్స్‌ అన్నీ ఒరిజినస్‌ మరియు రెండు సెట్లు జిరాక్స్‌ కాపీలు.

  • సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ముగిసిన తరువాత మీరు నమోదు చేసిన నెంబరుకు లాగిన్‌ ఐడి వస్తుంది.
  • మీ ర్యాంకును అనుసరించిన తేదీలలో ఫోన్‌ నెంబరుకు వచ్చిన లాగిన్‌ ఐడి మరియు పాస్‌ వర్డ్‌ ఆధారంగా వెబ్‌ కౌన్సిలింగ్‌ నందు మీకు నచ్చిన బ్రాంచ్‌లకు మీకు నచ్చిన వరుస క్రమంలో ప్రాధాన్యత (ఆప్షన్స్‌) నమోదు చేసుకోవాలి.
  • వెబ్‌ కౌన్సిలింగ్‌లో మొదటి అవకాశమే బెస్ట్‌! వెబ్‌ కౌన్సిలింగ్‌ లో తొలి ఎంపికే కీలకం. రెండోసారి కౌన్సిలింగ్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ, అప్పుడు ఛాన్స్‌లు తక్కువ, కేవలం మిగిలిన సీట్లకు మాత్రమే పోటీపడాల్సి వస్తుంది అందువల్ల మొదటి కౌన్సిలింగ్‌ సమయములోనే కొద్దిగా తెలివిగా వ్యవహరించాలి.
  • కౌన్సిలింగ్‌ ద్వారా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌, కలవపాముల నందు అడ్మిషన్‌ పొందాలనుకుంటే - మీకు నచ్చిన క్రమములో JPKP కి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి క్రింద తెలియపరచిన విధంగా ఆప్షన్స్‌ నమోదు చేయండి.

JPKP | AUT:4 | CIV:2 | ECE:3 | EEE:1 | MEC:5 |

వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ ముగిసిన పిదప గవర్నమెంట్‌ వారిచే మీకు సీటు ఖరారు చేయబడుతుంది.

సీటు కేటాయించబడిన తరువాత మరల మీ లాగిన్‌ ఐడి మరియు పాస్‌ వర్డ్‌ ఆధారంగా సంబంధిత వెబ్‌సైట్‌ నందు అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ మరియు సెల్ఫ్‌ జాయినింగ్‌ రిపోర్ట్‌ చేసి ప్రింట్‌ తీసుకుని మీకు కేటాయించబడిన కాలేజీ నందు ఇవ్వటం ద్వారా మీరు పాలిటెక్నిక్‌ అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకుంటారు.

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు ఎక్కడకు వెళ్ళాలి? 

Sri Jyothi Polytechnic