Welcome to JPKP: 2021-22::విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి.

JPKP COLLEGE || SPORTS TEAM || KABBADI WINNER Video

పాలిటెక్నిక్ ఎందుకు చదవాలి ?

పాలిటెక్నిక్ ఉద్యోగాల గని - ఉపాథి అవకాశాల పెన్నిధి

భారతదేశము ఇప్పటికీ అభివృద్ధి చెందుచున్న దేశాల జాబితాలోనే ఉంది. మనతోపాటే స్వాతంత్య్రము పొందిన దేశాలతో పోల్చితే చాలా వెనుకబడిపోయాము. మన పొరుగు దేశమైన చైనా ప్రపంచ 'ఆర్ధికశక్తి'గా అవతరించింది. దురదృష్టమేమిటంటే భారతదేశంలో నాణ్యమైన మానవనరులు ఉన్నప్పటికీ, చైనాతో పోల్చితే రెండు దశాబ్దాలు వెనుకబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా-ఏటా జరిగే నూతన ఆవిష్కరణల్లో మనదేశ వాటా ఒక శాతం కూడా ఉండట్లేదు. కానీ, అంకెల్లో అభివృద్ధి కనిపిస్తోంది. అదేమిటంటే నూతన ఉద్యోగాల సృష్టి, ఉపాధికల్పన లేని 'అభివృద్ధి'.

ఈ తరహా అభివృద్ధి - చదువుకున్న నిరుద్యోగ భారత్‌ను సృష్టిస్తుంది. ఇదొక జాతీయ వైపరీత్యం. ఈ సమస్య తీవ్రతను, మూలాన్ని దూరదృష్టితో పరిశీలించిన భారత ప్రభుత్వ విధాన నిర్ణేతలు నష్టనివారణ చర్యలు చేపట్టి అభివృద్ధి కొరకు ప్రణాళికలు రచించి దిశానిర్దేశనము చేస్తున్నారు. అందులో భాగంగా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా మరియు డిజిటల్‌ ఇండియా వంటికార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు.

ఈ ప్రణాళికలు అమలు చేయటం ద్వారా పెద్ద ఎత్తున ఉత్పత్తి, తయారీ పరిశ్రమలు, అంకురపరిశ్రమలు స్థాపించబడి, కంప్యూటరైజేషన్‌, సాంకేతిక అనువర్తన మరియు నైపుణ్య అభివృద్ధి జరుగుతుంది. తత్ఫలితంగా - ఇండియా ప్రపంచ వస్తుతయారీ మరియు సేవల కేంద్రంగా అవతరిస్తుంది. ఇండియా వస్తుతయారీ మరియు సేవల కేంద్రంగా మారుతున్న క్రమంలో - ఉద్యోగాల సృష్టి మరియు ఉపాథికల్పన జరిగి పెద్దఎత్తున నైపుణ్యయువత, పనిచేసే యువశక్తి అవసరమవుతారు. నిపుణులైన యువశక్తి పాలిటెక్నిక్‌ కాలేజీల నుండే తయారవుతారు. అందుచేత SSC (10th) తరువాత పాలిటెక్నిక్‌ చదవడమే బెస్ట్‌.

 

ఎందుకంటే ... ఉపాథి లేదా ఉద్యోగం గ్యారెంటీ. అంతేకాక పై చదువు కొనసాగించాలంటే.

 • ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ (P.Hd) వరకు చేయవచ్చు.
 • విదేశాలలో M.S చదవొచ్చు.
 • ఇండియాలో ప్రతిష్టాత్మక IIT లో M.Tech. చేయవచ్చు.
 • M.Tech ప్రతి ఏటా 8 ఏళ్ళపాటు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.
 

నాణ్యమైన బోధనలో - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మేమే నెం.1.    మా విద్యాప్రణాళిక ఎంత పటిష్టంగా ఉంటుందంటే...

మేము వివరించి చెప్పిన పాఠ్యాంశాలు, సాధన చేయించిన లెక్కలు, గీయించిన బొమ్మలే - ప్రభుత్వం వారిచే నిర్వహించబడే వార్షిక పరీక్షల్లో (100%) ఖచ్చితంగా వస్తాయి. ఇది ఏల సాధ్యం అంటే ... ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌లోని ఏ ఒక్క అంశాన్ని విడిచి పెట్టకుండా / ఏ ఒక్క లెక్క వదలకుండా వివరించి చెప్పడమే ఇందులొ ఉన్న రహస్యం.

పోటీ మరియు ప్రవేశ పరీక్షల్లో మా విద్యార్ధులే ముందంజలో ఉంటారు. క్యాలిక్యులేటర్‌ వాడకం / కంప్యూటర్‌ పరిజ్ఞానంలో తగిన తర్ఫీదునిచ్చి నైపుణ్యాల్ని అభివృద్ధి చేస్తాం. ఇంగ్లీషు మాట్లాడటం, వ్రాయిటంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ నియమాకానికి కావాలసిన అన్ని అర్హతల్ని పెంపొందిస్తాం.శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ - కోర్సుల వివరాలు

నిత్యనూతనము (ఎవర్ గ్రీన్)

డిప్లమో ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (DME:) సంప్రదాయ మరియు ప్రాచీనమైన ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మెకానికల్‌ ముఖ్యమైనది. అన్ని ఇంజనీరింగ్‌ శాఖలకూ మాతృకగా 'మెకానికల్‌'కు పేరుంది. లోహ, యంత్ర, శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కోర్సు ఇదే. ముడి పదార్ధాలు వస్తురూపం సంతరించుకోవడానికి యంత్రాలు తోడ్పడతాయి. ఆ యంత్రాల తయారీ నుంచి అవి పనిచేయండం వరకు యావత్తు వ్యవహారం మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పరిధిలోకి వస్తుంది. అన్ని రంగాలకు సంబంధించిన ఇంజన్ల డిజైనింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ మెయింటినెన్స్‌ మరియు వోవర్‌ హాలింగ్‌ ఈ శాఖకు చెందినవే . అధునాతన సదుపాయాలన్నింటికీ మూలము మెకానికల్‌ ఇంజనీరింగే . పారిశ్రామిక విప్లవంలో మెకానికల్‌ ఇంజనీర్ల పాత్ర వెలకట్టలేనిది.

కొలవుల నెలవు

డిప్లమో ఇన్‌ ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (DEEE:) అత్యధిక విద్యార్ధులు ఎంచుకునే బ్రాంచి - DEEE. ఆధునిక సుఖమయ జీవనానికి విద్యుత్తే మూలాధారము. 'విద్యుత్‌' లేని ప్రపంచాన్ని ఊహించటమే కష్టం. 'విద్యుత్‌' లేని సమాజములో జనజీవనం అంతా అస్తవ్యస్తం. అటువంటి విద్యుత్‌ ఉత్పత్తి, చేరవేత, పంపిణీ మరియు సరఫరాతో ముడిపడి ఉన్నదే - ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. పెరుగుతున్న జనాభాకు, గిరాకీ (డిమాండ్‌)కు అనుగుణంగా - సరిపడినంత విద్యుత్‌ ఉత్పత్తి చేసి నిరంతర సరఫరా చేయటమే ఎలక్ట్రికల్‌ ఇంజనీర్ల ముందున్న సవాల్‌.

ఎదగడానికి ఆకాశమే హద్దు.

డిప్లమో ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ (DCE:) సాంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సులలో 'సివిల్‌' చాలా ప్రాధాన్యమైనది. భూమి మీద మానవజాతి, మొక్కలు ఉన్నంతకాలము సివిల్‌ ఇంజనీరింగ్‌కు తిరుగులేదు. ఇంకా చెప్పాలంటే ... నగరాలు, పట్టణాలు, పల్లెలు మరియు కొండ ప్రాంతాలతో సహా జనావాసాలన్నింటిలో రహదారులు త్రాగునీరు మరియు మురుగునీటి వ్యవస్థలు ఏర్పడే వరకు సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్ధుల ఉద్యోగాలకు కొదవేలేదు.

ఉద్యోగాలగని - అవకాశాల పెన్నిథి

డిప్లమో ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (DECE:) ఇంజనీరింగ్‌ శాఖలన్నింటిలోకి బాగా గిరాకీ ఉన్న శాఖ ఇది. మానవ జీవన శైలిని అనునిత్యం ప్రభావితం చేస్తున్న శాఖ DECE మానవాళికి సమాచార వ్యవస్ధను అత్యంత చేరువ చేసిన చరవాణి (మొబైల్‌) సృష్ఠి ఈ రంగం ఇచ్చిన బహుమతే. గృహోపకరణాల నుండి ఉపగ్రహాల వరకు వాహన తయారీ దగ్గరనుండి ట్రాఫిక్‌ నియంత్రణ వరకు రోగ నిర్ధారణ యంత్రాల నుండి రక్షణ రంగాల వరకు అన్నింటిల్లో ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ శాఖ ప్రమేయం ఉండి తీరుతుంది.

అరుదైన కోర్సు - మెరుగైన అవకాశాలు

ఈ తరం నేర్చుకునే కోర్సు డిప్లమో ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మరియు మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఎనలిటిక్స్ మరియు విజువలైజేషన్ టెక్నాలజీల యొక్క సమ్మేళన జ్ఞానముతో తెలివైన యంత్రాలు, సాఫ్ట్ వేర్ లేదా అనువర్తనాలను రూపొందించడానికి విద్యార్ధులకు సహాయ పడుతుంది.

కంప్యూటర్ సైన్స్ నందు ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ పరిష్కారాలను అర్ధం చేసుకోవడానికి, విశ్లేషించడానికి మరియు అభివృద్ది చేయగల సామర్ధ్యం ఈ కోర్స్ విశిష్టత.

కంపెనీలు తమ ఉత్పత్తులను మరియు సేవలను మెరుగుపరచడానికి, వారి వ్యాపార నమూనాలను అంచనా వేయడానికి, నిర్ణయాత్మక ప్రక్రియను మెరుగుపరచడానికి AI & ML సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి.

మెరుగైన అవకాశాలు

అన్ని సాఫ్టువేరు కప్పినీలలో జూనియర్ ప్రోగ్రామర్ గా అవకాశాలు ‌, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కాలసెంటర్ లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి‌ మాన్యుఫాక్చరింగ్‌, రోబోటిక్స్‌ మొ|| రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.


డిప్లమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు E-Cet ద్వారా ఇంజనీరింగ్‌(B.Tech.,) 2వ సం|| బిటెక్ కంప్యూటర్ సైన్స్ లో ‌ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నలాజి కోర్సులో ఇంజనీరింగ్‌ శాఖల్లో అడ్మిషన్‌ పొందవచ్చు.

పాలిటెక్నిక్‌ విశిష్టతలు :

 • పాలిటెక్నిక్‌ విద్య పూర్తిగా ఉచితం.‌
 • ప్రతి నెలా స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.
 • చిన్న వయస్సులోనే ఉద్యోగం పొందే అవకాశం.
 • చూస్తూ, చేస్తూ మరియు గీస్తూ నేర్చుకునే విద్య.
 • మానసిక ఒత్తిడి లేని విద్య.
 • పాలిటెక్నిక్‌ నుంచి నేరుగా ఇంజనీరింగ్‌ 2వ సంత్సరంలోనికి ప్రెవేశము.
 • సమాజ అవసరాలు తీర్చే సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ మరియు ఆటోమొబైల్‌ పరిశ్రమల్లో ఉద్యోగం ఖాయం.
 • పాలిటెక్నిక్‌ ద్వారా ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్ధులకు ఉద్యోగాల్లో ప్రాముఖ్యత.
 

మా ప్రత్యేకతలు :

 • పాలిటెక్నిక్‌ విద్యారంగంలో 37 సంవత్సరాల అనుభవము ఉన్న శ్రీ ఎస్‌.వి.రమణ గారి నేతృత్వము.
 • క్యాంపస్‌లోనే యాజమాన్యము నివాసము.
 • 100% క్రమశిక్షణ.
 • ర్యాగింగ్‌ ఛాయ/ శబ్ధము లేని సంస్థ.
 • సర్వశ్రేష్ఠమైన విద్యా ప్రణాళిక.
 • శ్రేష్ఠమైన బోధన మరియు శిక్షణ.
 • ప్రాక్టికల్స్‌ శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ
 • రాష్ట్ర నలుమూలల నుండి అనువైన రవాణా సౌకర్యము.
 • విద్యార్ధినీ విద్యార్ధులకు మద్దతుగా స్పందించే అనుకూల యజమాన్యం.
 

మా సౌకర్యములు :

 • ప్రభుత్వ నియమనిబంధన మేరకు ఉచిత విద్య మరియు ఉచిత హాస్టల్‌ వసతి.
 • అనుకూలమైన టైమింగ్స్‌ ఉ|| 9 గంటల నుండి సా|| 4-20 ని||ల వరకు.
 • రాయితి కల్గిన రైలు మరియు బస్సు పాస్‌ సౌకర్యం.
 • ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన ల్యాబ్స్‌ మరియు వర్క్‌ షాప్స్‌.
 • విశాలవంతమైన లైబ్రరీ.
 • ఎల్లవేళలా అందుబాటులో ఉండే యాజమాన్యం.
 • బాలికల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ.
 • 100% ఉద్యోగ కల్పన.