Welcome to JPKP: 2021-22::విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి.

సెక్రటరీ & కరస్పాండెంట్ (శ్రీ. ఎస్.వి.రమణ)

సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదలతో B.TECH సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివి అధ్యాపక వృత్తి పట్ల ఉన్న ఇష్టంతో 1981 వ సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కాలేజీలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను.

అంచలంచలుగా ఎదుగుతూ సీనియర్‌ లెక్చరర్‌, సివిల్‌ డిపార్ట్‌ మెంట్‌ శాఖాదిపతి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ గా, వైస్‌ ప్రిన్సిపాల్‌ మరియు ప్రిన్సిపాల్‌ గా పదోన్నతులు పొంది వివిధ హోదాల్లో విధి నిర్వహణ చేశాను. విధి నిర్వహణలో వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆదరాభిమానాలు విశేషంగా పొందగలిగాను. వారి ఆకాంక్షల మేరకు వృత్తి బాధ్యతలు నెరవేర్చాను. నా ఉద్యోగ జీవిత ప్రారంభ దశ నుండి విద్యార్ధులకు సర్వశ్రేష్టమైన సాంకేతిక విద్యను అందించాలనే గాఢమైన కోరిక నాలో కొలువై ఉన్నది.

మూడు దశాబ్దాల నా ఉద్యోగ జీవితంలో విద్యార్ధుల నడక మరియు విద్యను అందించే సంస్థల తీరుతెన్నుల్లో చాలా అవాంఛనీయ మార్పులను కళ్లారా చూడటం జరిగింది.

ఈ మార్పులను పరిగణలోకి తీసుకుని ఉన్నతమైన విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించటానికి ఓ మోడల్‌ టెక్నికల్‌ ఇన్స్టిట్యూట్  (సాంకేతిక విద్యా సంస్ధ) స్ధాపించాలన్న నిర్ణయం 2010వ సంవత్సరంలో తీసుకున్నాను. ఆశయ సాకారానికై 2012 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ (JPKP) పేరుతో కళాశాల స్ధాపించటానికి శ్రీకారం చుట్టాను.

పాలిటెక్నిక్‌ విద్య గురించి నాకు ఉన్న అవగాహన మరియు అనుభవంతో నేను దైర్యంగా, ఆత్మవిశ్వాసంతో 2013-14 విద్యా సంవత్సరం నుండి కలవపాముల గ్రామం నందు శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ అందుబాటులోకి తీసుకుని వచ్చాను.

 

పాలిటెక్నిక్‌ విద్య గురించి నా అనుభవం మరియు అవగాహన

ఆధునిక ప్రపంచంలో సాంకేతిక రంగాల ప్రాధాన్యం చాలా పెరిగింది. పాలిటెక్నిక్‌ మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన వారికే సాంకేతిక రంగంలో మరియు పరిశ్రమల్లో ఉన్నత స్థానం కల్పిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్ధులకంటే పాలిటెక్నిక్‌ విద్యార్ధులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఒకప్పుడు దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించే నిపుణులైన మానవ వనరులను అందించేది పాలిటెక్నిక్‌ విద్యా సంస్ధలే. పాలిటెక్నిక్‌ విద్య మరియు విద్యార్ధుల పూర్వ వైభవం అపురూపం. ITI మరియు B.TECH వారికి మధ్యన అనుసంధాన ఇంజనీర్లుగా డిప్లమో చదివిన విద్యార్ధులు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

కానీ ఇటువంటి పాలిటెక్నిక్‌ విద్య ప్రస్తుతం మార్కెటింగ్‌ వస్తువుగా మారిపోయింది. కారణము విద్యారంగంలో వచ్చిన అనేక మార్పులు. ఫలితంగా సాంకేతిక విద్యారంగానికి సంబంధం లేనివారు కూడా ప్రవేశించి ఇబ్బడిగా సంస్థలు స్థాపించి వృత్తి విలువలకు తిలోదకాలు ఇచ్చిన  సందర్భాలు ఉన్నవి. మొత్తం మీద ప్రతిభావంతులైన విద్యార్ధులకి పాలిటెక్నిక్‌ సీట్లు లభించే స్థితి నుండి అడ్మిషన్ల కొరకు సంస్థ ప్రతినిధులు విద్యార్థి వెంటపడే పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇదే అదనుగా సాంకేతిక విద్య కూడా అమ్మదగిన వస్తువుగా భావించిన కొందరు బ్రోకర్లు, ఏజెంట్లు కన్సల్టెంట్స్‌ అవతారాలెత్తి విద్యార్ధులను గందరగోళ పరిస్థితులలోకి నెట్టి వేస్తున్నారు. కమీషన్లు ఇచ్చే కాలేజీల్లో చేరుస్తున్నారు.

మీ కుమారుడు / కుమార్తె విద్యా స్థాయి, అవగాహన శక్తి మరియు మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి పరిగణలోనికి తీసుకోకుండా ఇతరులు చెప్పే మాటలకు లొంగవద్దు.

వివిధ పేర్లు, స్కీములతో ఆకర్షణీయంగా కనబడే కాలేజీల్లో చేర్చి విద్యార్థులను మానసికంగా హింసించవద్దు. అప్పుల్లో కూరుకుపోయేంత ఖర్చులు పెట్టి చదువు కొనవద్దు. వడ్డీలు చెల్లిస్తున్న బాధతో పిల్లలకు వారు మోయలేని లక్ష్యాల్ని నిర్దేశించవద్దు. పిల్లల్ని మొత్తానికే మొద్దులుగా, సోంబేరులుగా తయారుచేయవద్దు.

ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మీ జీవితంలో పెనుమార్పులకు నాంది. దగ్గర, దూరం, కొత్త, పాత లేదా పెద్ద, చిన్న బిల్డింగ్‌ మొదలగు విషయాలు పరిగణలోకి తీసుకోకుండా చదువు ఎక్కడ బాగా చెబుతారో, క్రమశిక్షణ ఎక్కడ బాగుంటుందో, చదువుకునే వాతావరణం ఎక్కడ బాగా కల్పిస్తారో మీరు స్వయంగా చూసి, తెలుసుకుని మంచి సంస్థలో చేరండి. మంచి భవిష్యత్తు నిర్మించుకోండి.

మా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ గురించి