సంప్రదాయ మరియు ప్రాచీనమైన ఇంజనీరింగ్ కోర్సుల్లో మెకానికల్ ముఖ్యమైనది. అన్ని ఇంజనీరింగ్ శాఖలకూ మాతృకగా 'మెకానికల్'కు పేరుంది.
లోహ, యంత్ర, శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కోర్సు ఇదే.
ముడి పదార్ధాలు వస్తు రూపం సంతరించుకోవడానికి యంత్రాలు తోడ్పడతాయి. ఆ యంత్రాల తయారీ నుంచి అవి పనిచేయండం వరకు యావత్తు వ్యవహారం మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తుంది. అన్ని రంగాలకు సంబంధించిన ఇంజన్ల డిజైనింగ్, మాన్యుఫాక్చరింగ్ మెయింటినెన్స్ మరియు వోవర్ హాలింగ్ ఈ శాఖకు చెందినవే.
అధునాతన సదుపాయాలన్నింటికీ మూలము మెకానికల్ ఇంజనీరింగ్ పారిశ్రామిక విప్లవంలో మెకానికల్ ఇంజనీర్ల పాత్ర వెలకట్టలేనిది.
లఘు పరిశ్రమలు మొదలు అతి భారీ స్థాయి పరిశ్రమల్లో (చిన్న, పెద్ద అన్ని తరహా పరిశ్రమల్లో) యంత్రాల స్థాపన (Installation) పనిచేయటం (Operation) నిర్వహణ మరియు మరమ్మతులు (Maintenance & Lepail) మరియు వోవర్ పోలింగ్ దశల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
సిమెంట్, స్టీలు, రక్షణ, పరిశోధన, ఆక్వా, ఆహారము, పానీయాలు, రైల్వేస్, టెలికామ్, RTC Peliofiecom, రసాయనాలు, రంగులు ఔషధ పరిశ్రమలు, విమానయానము, నౌకాయానము, గనులు.
మరమనుషులు, వాహనతయారీ. మొ|| అన్ని రకాల పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
స్వయం ఉపాధి / ఔత్సామిక పారిశ్రామిక వేత్తలుగా అవకాశాలు, పరిశ్రమల స్ధాపన ద్వారా స్వయం ఉపాధి, పరిశ్రమల స్ధాపనకై కన్సల్టెంట్స్గా రాణించవచ్చు. ఫ్యాబ్రికేషన్ రంగంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా స్ధిరపడవచ్చు. వివిధ పరిశ్రమలకు కావలసిన విడి భాగాలను తయారుచేసే అనుబంధ పరిశ్రమలు నెలకొల్పవచ్చు.
NSDC అంచనా ప్రకారము రానున్న ఐదేళ్ళలో దేశములో .......... మిలియన్ల సంఖ్యలో మెకానికల్ ఇంజనీర్ల అవసరం ఉంది.
డిప్లమో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్ధులు B.Tech. (ఇంజనీరింగ్ 2వ సం||లోనికి E-Cet పరీక్ష ద్వారా నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. బ్రాంచ్ మార్పు : DME విద్యార్ధులు, ఇంజనీరింగ్లో మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటిక్స్ ఏరోస్పేస్, ప్రొడక్షన్, మెకానికల్ మెరైన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకట్రానిక్స్ వంటి ఎనిమిది కోర్సుల్లోకి మారవచ్చు.