డిప్లమో ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (DECE)

ఇంజనీరింగ్‌ శాఖలన్నింటిలోకి బాగా గిరాకీ ఉన్న శాఖ ఇది. మానవ జీవన శైలిని అనునిత్యం ప్రభావితం చేస్తున్న శాఖ DECE మానవాళికి సమాచార వ్యవస్ధను అత్యంత చేరువ చేసిన చరవాణి (మొబైల్‌) సృష్ఠి ఈ రంగం ఇచ్చిన బహుమతే.

గృహోపకరణాల నుండి ఉపగ్రహాల వరకు

వాహన తయారీ దగ్గరనుండి ట్రాఫిక్‌ నియంత్రణ వరకు

రోగ నిర్ధారణ యంత్రాల నుండి రక్షణ రంగాల వరకు అన్నింటిల్లో ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ శాఖ ప్రమేయం ఉండి తీరుతుంది. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ మరియు సాఫ్ట్‌వేర్‌ శాఖాల కలయకే ECE శాఖ

ఉద్యోగాలు ఏయేరంగాల్లో ?

రేడియో అంతరిక్ష పరిశోధన, ప్రింట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియా, దూరదర్శన్‌, టెలిమ్యూనికేషన్స్‌ వినోదరంగం రక్షణ రంగం, మొబైల్‌ మాన్యుఫాక్చరింగ్‌, రైల్వేస్‌, వాహన తయారీ, గృహోపకరణాల తయారీ, ప్రచార రంగం సాఫ్ట్‌వేర్‌, మెడికల్‌ ఎక్వివ్‌మెంట్‌, రోబోటిక్స్‌ మొ|| రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

ఏయే సంస్థల్లో ఉద్యోగాలు ?

ఇస్రో, షార్‌, రేడియోస్టేషన్స్‌ BSNL, MTNL, Railways, NT PC, ECIL, DRDO, DRDL, All Mobile Manufacturing Companies, Telecom Service Provides BEL, BHEL, Invertee Manufactures, House Hold AppliancesManufactures etc.,

స్వయం ఉపాధి / ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా అవకాశాలు :

బ్యాటరీ తయారీ రంగం, సోలార్‌ పవర్‌ జనరేషన్‌ ఎక్విప్‌మెంట్‌, LED లైట్స్‌ తయారీ, ఆప్టికల్‌ ఫైబర్‌ ప్రొడక్షన్‌, PCB తయారీ మొదలైన 33 రకాల చిన్నతరహా పరిశ్రమలు స్ధాపించి స్వయం ఉపాధి పొందవచ్చు. NSDC అంచనా ప్రకారము రానున్న ఐదేళ్ళలో దేశములో ....... మిలియన్ల సంఖ్యలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్ల అవసరము ఉంది.

బ్రాంచ్‌ మార్పు :

ఈ సి ఇ చదివిన డిప్లమో విద్యార్ధులు E-Cet ద్వారా ఇంజనీరింగ్‌ (B.Tech.,) 2వ సం||లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ శాఖల్లో అడ్మిషన్‌ పొందవచ్చు.