డిప్లమో ఇన్‌ ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (DEEE)

అత్యధిక విద్యార్ధులు ఎంచుకునే బ్రాంచి - DEEE

ఆధునిక సుఖమయ జీవనానికి విద్యుత్తే మూలాధారము. 'విద్యుత్‌' లేని ప్రపంచాన్ని ఊహించటమే కష్టం.

'విద్యుత్‌' లేని సమాజములో జనజీవనం అంతా అస్తవ్యస్తం. అటువంటి విద్యుత్‌ ఉత్పత్తి, చేరవేత, పంపిణీ మరియు సరఫరాలు ముడిపడి ఉన్నదే - ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. పెరుగుతున్న జనాభాకు, గిరాకీ (డిమాండ్‌)కు అనుగుణంగా - సరిపడినంత విద్యుత్‌ ఉత్పత్తి చేసి నిరంతర సరఫరా చేయటమే ఎలక్ట్రికల్‌ ఇంజనీర్ల ముందున్న సవాల్‌.


విద్యుత్‌ వినియోగం ఎక్కడ ?

అన్ని రంగాలకు చెందిన చిన్న, పెద్ద పరిశ్రమలు విద్య, వైద్య సంస్థలు రైలు రవాణా వ్యవస్థలు, వ్యవసాయము, గనులు, పర్యాటకము, వినోద ఎలక్ట్రానిక్‌ సాధనాలు, గృహోపకరణాల తయారీ పరిశ్రమలు, సాగునీటి ఎత్తిపోతల పధకాలు ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్‌ వాడని క్షణము, వ్యవస్థ ఉండదు. మరే ఇతర ఇంజనీరింగ్‌ శాఖకు ఇంతటి ప్రాధాన్యము లేదు.


ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయి ?

ధర్మల్‌, జల, పవన, సౌర, అణు, అలల (టైడల్‌) గ్యాప్‌ మరియు బయోమాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి చేరవేత, పంపిణీ మరియు వినియోగ రంగాల్లో డిప్లమో ఇంజనీర్లకు ఉద్యోగాలు కోకొల్లలు. అంతేకాక, విద్యుత్‌ వినియోగ పరికరాల తయారీ, టెలికమ్యూనికేషన్స్‌ రైలు రవాణా, గృహ మరియు పరిశ్రమ సంబంధ వైరింగ్‌ పేనల్‌ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి.

స్వయం ఉపాధి / జీత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా అవకాశాలు ?

పరిశ్రమలు / గృహ సంబంధ వైరింగ్‌ నిపుణులుగా స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చు. పేనల్‌ బోర్డులు తయారీ, మరమ్మతులు భారీ విద్యుత్‌ యంత్రాల మరమ్మతులు నిర్వహణలో స్వీయ సంపాదనలో పాటు పలువరికి ఉపాధి కల్పించవచ్చు. విద్యుత్‌ ఉత్పత్తి సంబంధిత సంస్ధలకు వనరులు సమకూర్చే గుత్తేదార్లు (కాంట్రాక్టర్లు)గా జీత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ... ఎలక్ట్రీషియన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ఇంజనీరు లేకుండా ఏ వ్యవస్ధలోనైనా ఒక్కరోజు కూడా పని జరగదు. కాబట్టి ఎలక్ట్రికల్‌ డిప్లమో ఇంజనీర్లకు నిరుద్యోగ సమస్య తలెత్తదు.

టాప్‌ రిక్రూటర్స్‌ :

AP Genco, AP Transco, APSPDCL All Theemal, Hydal, Wind, Gas & Nuclear Power Plants, ONGC, SAIL, BHEL, BEL, HAL, GAIL, COAL India, IOCL Reliance, Tata Power, Cement Sugar Textile, Printing, Aqua Feed / Process Plants, Paper, Railways, BSNL, DRDO DRDL, Samsung, LG, GVK Power మొ|| అనేక సంస్థలు. ఈ రంగంలో శ్రీఐఈ్పు అంచనా ప్రకారము వచ్చే 5 ఏళ్ళల్లో (2025 నాటికి) భారతదేశములో కావల్సిన డిప్లమో ఇంజనీర్ల సంఖ్య.................లక్షలు.

కొసమెరుపు :

నేటి ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐ.టి. రంగాలకు మాతృక ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగే.