డిప్లమో ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ (D.C.E.)

ఎదగడానికి ఆకాశమే హద్దు.

సాంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సులలో 'సివిల్‌' చాలా ప్రాధాన్యమైనది.

భూమి మీద మానవజాతి, మొక్కలు ఉన్నంతకాలము సివిల్‌ ఇంజనీరింగ్‌కు తిరుగులేదు.

ఇంకా చెప్పాలంటే ... నగరాలు, పట్టణాలు, పల్లెలు మరియు కొండ ప్రాంతాలతో సహా జనావాసాలన్నింటిలో రహదారులు త్రాగునీరు మరియు మురుగునీటి వ్యవస్థలు ఏర్పడే వరకు సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్ధుల ఉద్యోగాలకు కొదవేలేదు.

మానవ నిర్మిత పరిసరాలను సృష్ఠించడంలో వాటిని కాపాడటంలో సివిల్‌ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమైనది. దేశంలో అవస్థాపన, మౌలిక సదుపాయ రంగాలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో సంబంధిత విధుల పర్యవేక్షణకు భారీ సంఖ్యలో సివిల్‌ ఇంజనీర్ల అవసరము ఉన్నది.

ఉద్యోగాలు ఎక్కడ లభిస్థాయి ?

భూ ఉపరితల రోడ్డు, రైలు రవాణా మార్గాల రూపకల్పన, నిర్మాణము, నిర్వహణ మరియు మరమ్మత్తు రంగాలు

జల రవాణాకు సంబంధించి ఓడరేవులు నిర్మాణము

వాయు రవాణాకు సంబంధించి విమానాశ్రయాలు నిర్మాణము

సాగు / త్రాగునీటి ప్రాజెక్టులో భాగమైన డ్యాములు (జలాశయాలు) బ్రిడ్జిలు, బ్యారేజ్‌లు, నీటి పారుదల వ్యవస్థల రూపలక్పన, నిర్మాణము, నిర్వహణ మరియు మరమ్మత్తులు.

భూగర్భ మరియు ఉపరితల జలవనరుల వినియోగము

గృహ నిర్మాణము / భవన నిర్మాణము

మురుగునీటి వ్యవస్ధల ఏర్పాటు, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులు

టౌన్‌ ప్లానింగ్‌

సర్వేయింగ్‌ మొ|| రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

స్వయం ఉపాధి / ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా అవకశాలు :

సివిల్‌ ఇంజనీరింగ్‌ కన్సల్‌టెంట్స్‌గా, లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్‌గా స్వయం ఉపాధి పొందవచ్చు. గుత్తేదార్లుగా, రియల్టర్లుగా స్ధిరపడటం ద్వారా విలాసవంతమైన జీవితాల్ని కైవశం చేసుకోవచ్చు. వివిధ బ్యాంకులకు పేనల్‌ వేల్యుయర్స్‌గా రాణించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ..... సివిల్‌ ఇంజనీర్లకు ఉపాధి / ఉద్యోగం గ్యారంటీ.

టాప్‌ రిక్రూటర్స్‌ :

NHAI, AAI, CPWD, PWD, Panchayat Raj, APIIC, I & CAD, R & B, Railways, Drainage Board CRDA, Town Planning, Municipal Engineering, DTCP, Revenue, RWS, DOCK Yards, APSRTC ONEC మొ||నవి. DMRC, RITES, Jayaprakash Associates, Reliance Infra, L & T, GMR, Cement Industries, మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణ సంస్ధలు, ఫ్లైవోవర్‌, ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ సంస్ధలు అన్నింటిలో ఉద్యోగాలు లభిస్తాయి.

కొసమెరుపు :

సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన ఏ ఒక్క డిప్లమో ఇంజనీరు ఖాళీగా లేరు. NSDC అంచనా ప్రకారము రానున్న .............. ఏళ్ళలో దేశము .............. మిలియన్ల సివిల్‌ ఇంజనీర్ల అవసరం ఉన్నది.