బాయ్స్‌ క్యాంపస్‌ హాస్టల్‌

రోజూ ఇంటి నుండి కాలేజీకి రాకపోకలు సాగించే వీలు లేని విద్యార్ధులకు హాస్టల్‌ వసతి చాలా ముఖ్యం. అలాగే ఏ రోజూ పాఠ్యాంశాలు ఆ రోజే చదివి, అవగాహన చేసుకోవాలనుకునే విద్యార్ధులకు హాస్టల్‌ వసతి ఓ వరం.

పాఠ్యాంశాలు బోధించే మా లెక్చరర్స్‌చే రోజుకు 4 గంటలు ఉచితంగా స్టడీ అవర్స్‌ నిర్వహించబడును.

విశాలవంతమైన వసతి సౌకర్యము.

ఉదయం టిఫిన్‌ మరియు రెండు పూటలు భోజనము.

24 గంటలు కరెంటు మరియు నీటి సౌకర్యము.

అదనపు చార్జీలు వసూలు చేయబడవు.


నియమ నిబంధనలు:

నగదు రు.100/- కంటే ఎక్కువ కల్గి ఉండకూడదు.

సెల్‌ ఫోన్ల వలన అనేక అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుచున్నవి. హాస్టల్‌లో సెల్‌ఫోన్లు కల్గిఉండకపోవటమే శ్రేయస్కరము.

ఎవరైనా విద్యార్ధి మా అనుమతి లేకుండా సెల్‌ఫోన్లు తెచ్చి పొగొట్టుకుని లేదా మరే ఇతర కారణము చేతనైనా వాతావరణాన్ని కలుషితము చేసినట్లయితే సదరు విద్యార్ధిని హాస్టల్‌ నుండి పంపివేయబడును.

ఐరన్‌ బాక్సులు, వాటర్‌ హీటర్స్‌ మరియు ఏ రకమైన ఎలక్ట్రికల్‌ మరియు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు కలిగి ఉన్నచో రు.500/- అపరాధ రుసుము విధింపబడును.

బిల్‌ సకాలములో చెల్లించుటలో విఫలమైన విద్యార్ధులకు హాస్టల్‌ సౌకర్యము లభించదు.

ఎట్టి పరిస్థితులలో పాకెట్‌ మనీ లేదా ఖర్చుల కోసము డబ్బు ఇవ్వబడదు.

హాస్టల్‌ విద్యార్ధులు ఖచ్చితంగా సామాజిక మర్యాదలు పటించవలెను. ఒకరినొకరు గౌరవించుకుని ఇతరుల పట్ల సంస్కారవంతమైన ప్రవర్తన కల్గి ఉండవలెను. అనాగరిక భాష, చేష్టలు ప్రదర్శించే వారు హాస్టల్‌ నుండ వేలివేయబడుదురు.

ఇతరుల వస్తువుల పట్ల వ్యామోహముతో అనుమానస్పదంగా వ్యవహరించిన వారిని హాస్టల్‌ నుండి తొలగించబడును.

బాత్‌ రూమ్స్‌, లెట్రిన్స్‌ ఉపయోగించిన తరువాత ఎక్కువ నీరు పోసి పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి.

హాస్టల్‌కు సంబంధించిన ఫర్నీచర్‌, సామాగ్రి మొదలగు వాటికి ఏ విధమైన నష్టం కల్గించరాదు. నష్టపరిహారం సదరు విద్యార్ధి నుండే వసూలు చేయబడును.

మెస్‌ నందు భోజన పద్దతులు మర్యాదలు పాటించవలెను.

రాత్రి సమయములందు అత్యంత క్రమశిక్షణతో మెలగి స్టడీ అవర్‌ పూర్తి కాగానే నిద్రపోవలెను. సహవిద్యార్ధులకు ఇబ్బంది కలిగే రీతిలో ప్రవర్తించరాదు.

హాస్టల్‌ నందు బిగ్గరగా మాట్లాడరాదు మరియు వరండాల్లో పరిగెత్తరాదు.

ఎవరికి సంబంధించిన వస్తువులు మరియు సామాగ్రిని వారే సంరక్షించుకొనవలెను. అజాగ్రత్తగా,నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు.

గ్రూపులు, ముఠాలు కట్టరాదు.

అసహజ, అభ్యంతరకర ప్రవర్తన కల్గి ఉండరాదు.

కాలేజి లేదా మెస్‌ సిబ్బందితో ఆర్థిక లావాదేవీలు కల్గి ఉండరాదు.

సినిమాలు, క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి అభ్యంతర విషయాల్లో పాల్గొనరాదు.

అదే విధంగా విద్యార్ధులు కూడా పరస్పరం ఆర్థిక లావాదేవీలు, సెల్‌ఫోన్‌ కొనుగోళ్ళు, అమ్మకాలు, రిపేర్లు, ATM కార్డులు వాడకాలు, ATM కార్డ్‌ పాస్‌ వర్డ్స్‌ తెలియజేయటం వంటి విషయాలు నిషేధితం.

STUDY HOUR TIMMINGS ను తు.చ తప్పక పాటించవలెను.

తల్లిదండ్రుల అంగీకారము తెలిపిననూ వార్డెన్‌ మరియు ప్రిన్సిపల్‌ అనుమతి లేనిదే బైటకు వెళ్ళరాదు.

ర్యాగింగ్‌ చట్టరిత్యా నేరము, మరియు నిషేధితం, అతిక్రమించిన వారు చట్టరీత్యా శిక్షార్హులు.

Day-Scholars ను హాస్టల్‌కు తీసుకురాకూడదు.

గట్టి బందోబస్తు గొళ్ళెం కల్గి ఉన్న ట్రంకు పెట్టె తప్పనిసరి.

నగదుగా డబ్బు కలిగి ఉండరాదు.

బిల్లులు తమ సొంత బ్యాంక్‌ ఎకౌంట్‌నకు జమచేసుకొనవలెను.

అభ్యంతర సాహిత్యము, నవలలు, సినిమా పత్రికలు, సినిమా నటీనటులు మరియు ఆటగాళ్ళ చిత్రాలు కలిగి ఉండరాదు మరియు నిషేదము.

నిక్కర్లు మరియు 3/4 ప్యాంట్స్‌ ధరించి హాస్టల్‌ ఫ్లోర్‌ దిగి క్రిందికి రాకూడదు.

వరండాలో బిగ్గరగా మాట్లాడరాదు.

స్తులు కేటాయించిన / సూచించిన ప్రదేశములో మాత్రమే ఉతకవలెను.

Birthday Parties నిషేధము.

హాస్టల్‌ నందు నివశించు విద్యార్ధులు బైట నుండి ఆహార పదార్ధాలు తెచ్చుకుని హాస్టల్‌ నందు భుజించుట నిషేధము. డైనింగ్‌ హాల్‌ నందు భుజించవలెను. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారము కూడా డైనింగ్‌ హాల్‌ నందే భుజించవలెను.

అనారోగ్యము ఉన్న విద్యార్ధులు విశ్రాంతి గది (Sick Room) నందు విశ్రాంతి తీసుకొనవలెను.

అల్పాహారం/భోజనము రూమ్‌ వద్దకు తీసుకుపోవుటకు అనుమతిలేదు.


ఆహారము:

టిఫిన్‌ (పరిమితం) : వారములో మూడు రోజులు : ఇడ్లీ (4 చొప్పున), ఒకరోజు : పునుగు (4 చొప్పున) రెండు రోజులు : పులిర, ఒకసారి : వెజిటబుల్‌ ఫ్రైడ్‌ రైస్‌.

ప్రతిరోజు ఉదయము రాగుల జావ అందజేయబడును.

భోజనము (మధ్యాహ్నం, రాత్రి) : B.P.T రైస్‌తో ఒక కూర, సాంబారు మరియు పెరుగుతో రుచి, శుచికల్గిన సంపూర్ణమైన భోజనము.

చికెన్‌ : ప్రతి ఆదివారం సరఫరా చేయబడును.

శాఖాహారులకు ఆదివారము : రోజువారీ మాదిరే వడ్డించబడును.