డిప్లమో ఇన్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

మెషిన్ లెర్నింగ్ ‌ ఇంజనీరింగ్

ఈ తరం నేర్చుకునే కోర్సు డిప్లమో ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మరియు మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఎనలిటిక్స్ మరియు విజువలైజేషన్ టెక్నాలజీల యొక్క సమ్మేళన జ్ఞానముతో తెలివైన యంత్రాలు, సాఫ్ట్ వేర్ లేదా అనువర్తనాలను రూపొందించడానికి విద్యార్ధులకు సహాయ పడుతుంది.

కంప్యూటర్ సైన్స్ నందు ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ పరిష్కారాలను అర్ధం చేసుకోవడానికి, విశ్లేషించడానికి మరియు అభివృద్ది చేయగల సామర్ధ్యం ఈ కోర్స్ విశిష్టత.


కంపెనీలు తమ ఉత్పత్తులను మరియు సేవలను మెరుగుపరచడానికి, వారి వ్యాపార నమూనాలను అంచనా వేయడానికి, నిర్ణయాత్మక ప్రక్రియను మెరుగుపరచడానికి AI & ML సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి.


అన్ని పరిశ్రమలలో తెలివైన మరియు ఖచ్చితమైన నిర్ణయాత్మక వ్యవస్థల అవసరం పెరుగుతోంది. కావున రాబోయే సంవత్సరాల్లో అన్ని రంగాల పరిశ్రమలు వృద్ధి చెందడానికి AI & ML సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం జరుగుతుంది.

ప్రస్తుత కాలములో, ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో వినియోగిస్తున్న AI & ML కోర్స్ “గ్లోబల్ టెక్నాలజీ“ గా ప్రసిద్ది చెందింది.

ఉద్యోగ అవకాశాలు ఏయే రంగాల్లో.

ఆరోగ్య సంరక్షణ, విమానయానం, రక్షణ రంగం, లాజిస్టిక్స్ , రోబోటిక్స్ , వ్యవసాయం, బ్యాంకింగ్, ఇ-కామర్స్ వంటి రంగాల్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, డేటా సైంటిస్ట్ , మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్ , కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా ఉద్యోగ అవకాశాలు కలవు.

ఏయే సంస్థల్లో ఉద్యోగాలు ?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, గూగుల్, ఫేస్ బుక్, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (బిబిఎం), ఇన్ఫోసిస్ లిమిటెడ్, లెనోవా గ్రూప్ లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్, హెచ్ సి యల్ టెక్నాలజీస్, విప్రో ఎంటర్ ప్రైజెస్ , మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, అమెజాన్ గ్రూప్, ఫ్లిప్ కార్ట్ మొదలగు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కలవు.