పాలిటెక్నిక్‌ అడ్మిషన్‌ పొందటం చాలా సులభం

అడ్మిషన్‌ ప్రక్రియ ఇలా.....

1) పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న లేదా పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్ధినీ విద్యార్ధులు ఏ వయస్సు వారైనా పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించటానికి అర్హులే.

2) పాలిటెక్నిక్‌ అడ్మిషన్‌ పొందటానికి ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్షలు పూర్తి అయిన తరువాత ఏప్రియల్‌/మే నెలలో గవర్నమెంట్‌ వారిచే నిర్వహించబడు పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష (పాలిసెట్‌) వ్రాయాలి.

3) ఎంట్రన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి కావలసినవి : 1) పదవ తరగతి హాల్‌ టికెట్‌ నెంబరు SSC Hall Ticket Number) లేదా స్కూల్‌ చైల్డ్‌ ఐడి (School Child ID) 2) పూర్తి ఇంటి చిరునామా (House Address) మరియు 3) ఫోన్‌ నెంబర్‌ (Phone Number).

4) ఎంట్రన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి సంబంధించిన తేదీలు, పరీక్ష తేదీ మరియు పరీక్ష ఫీజు వివరములు ఫిబ్రవరి నెలలో గవర్నమెంట్‌ వారిచే పత్రికా ప్రకటన విడుదల చేయబడుతుంది. వివరములకు సందర్శించవలసిన ముఖ్య వెబ్‌ సైట్లు :http:// sbtetap.gov.in & http://appolycet.e-pragati.in/

5) పదవ తరగతిలో ఉన్న పాఠ్యాంశాల నుండి 120 (లెక్కలు : 60, ఫిజిక్స్‌ : 30 మరియు కెమిస్ట్రి : 30) ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రశ్న క్రింద ఇవ్వబడిన 4 జవాబుల్లో సరైన జవాబును గుర్తించాలి. జవాబును OMR‌ షీట్‌ పైన HB పెన్సిల్‌తో సరైన జవాబును బబుల్‌ చెయ్యాలి. 30 / 120

6) ఎంట్రన్స్‌ పరీక్ష ఇంగ్లీషు మరియు తెలుగు భాషలందు వేర్వేరుగా ఉంటుంది.

7) SC/ST విద్యార్ధినీ విద్యార్ధులకు కనీస అర్హత మార్కు లేదు. అంటే... పరీక్ష వ్రాస్తే చాలు! ర్యాంకు మరియు సీటు గ్యారంటీ. ఇతర కులాలకు సంబంధించిన విద్యార్ధినీ విద్యార్ధులకు కనీస అర్హత మార్కు :30 మాత్రమే.

8) దాదాపు హాజరైన విద్యార్ధుల్లో అధికశాతం అర్హత సాధించటం ప్రతి ఏటా జరుగుతున్నదే!

9) ఎంట్రన్స్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకును ఆధారంగా తీసుకుని కౌన్సిలింగ్‌ ప్రక్రియకు మొదలవుతుంది.

10) కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ ప్రకారము మీ ర్యాంకును బట్టి కౌన్సిలింగ్‌ కేంద్రాలలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావలెను.

11) సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు కావలసిన సర్టిఫికెట్‌ వివరములు .....

a) పాలిసెట్‌ హాల్‌టికెట్‌

b) పాలిసెట్‌ ర్యాంక్‌ కార్డ్‌

c) పదవ తరగతి మార్కుల జాబితా

d) పదవ తరగతి బదిలీ సర్టిఫికెట్‌

e) 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్‌ లేదా నివాస ధృవీకరణ పత్రము (మీ సేవా కేంద్రం నందు పొందవలెను).

f) కుల ధృవీకరణ పత్రము (మీ సేవా కేంద్రం నందు పొందవలెను.)

j) రేషన్‌ కార్డ్‌.

i) విద్యార్ధి మరియు విద్యార్ధి తల్లి దండ్రుల ఆధార్‌ కార్డ్స్‌.

j) గవర్నమెంట్‌ వారిచే నిర్ణయించబడిన సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ (కౌన్సిలింగ్‌) ఫీజు.


గమనిక : పైన పేర్కొన్న సర్టిఫికెట్స్‌ అన్నీ ఒరిజినస్‌ మరియు రెండు సెట్లు జిరాక్స్‌ కాపీలు.


12) సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ముగిసిన తరువాత మీరు నమోదు చేసిన నెంబరుకు లాగిన్‌ ఐడి వస్తుంది.

13) మీ ర్యాంకును అనుసరించిన తేదీలలో ఫోన్‌ నెంబరుకు వచ్చిన లాగిన్‌ ఐడి మరియు పాస్‌ వర్డ్‌ ఆధారంగా వెబ్‌ కౌన్సిలింగ్‌ నందు మీకు నచ్చిన బ్రాంచ్‌లకు మీకు నచ్చిన వరుస క్రమంలో ప్రాధాన్యత (ఆప్షన్స్‌) నమోదు చేసుకోవాలి.

14) వెబ్‌ కౌన్సిలింగ్‌లో మొదటి అవకాశమే బెస్ట్‌! వెబ్‌ కౌన్సిలింగ్‌ లో తొలి ఎంపికే కీలకం. రెండోసారి కౌన్సిలింగ్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ, అప్పుడు ఛాన్స్‌లు తక్కువ, కేవలం మిగిలిన సీట్లకు మాత్రమే పోటీపడాల్సి వస్తుంది అందువల్ల మొదటి కౌన్సిలింగ్‌ సమయములోనే కొద్దిగా తెలివిగా వ్యవహరించాలి.

15) కౌన్సిలింగ్‌ ద్వారా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌, కలవపాముల నందు అడ్మిషన్‌ పొందాలనుకుంటే - మీకు నచ్చిన క్రమములో JPKP కి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి క్రింద తెలియపరచిన విధంగా ఆప్షన్స్‌ నమోదు చేయండి.

JPKP | AUT:4 | CIV:2 | ECE:3 | EEE:1 | MEC:5 |

16) వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ ముగిసిన పిదప గవర్నమెంట్‌ వారిచే మీకు సీటు ఖరారు చేయబడుతుంది.

17) సీటు కేటాయించబడిన తరువాత మరల మీ లాగిన్‌ ఐడి మరియు పాస్‌ వర్డ్‌ ఆధారంగా సంబంధిత వెబ్‌సైట్‌ నందు అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ మరియు సెల్ఫ్‌ జాయినింగ్‌ రిపోర్ట్‌ చేసి ప్రింట్‌ తీసుకుని మీకు కేటాయించబడిన కాలేజీ నందు ఇవ్వటం ద్వారా మీరు పాలిటెక్నిక్‌ అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకుంటారు.