2020-21 విద్యా సంవత్సరానికి సీటు కొరకు నేరుగా లేదా ఫోన్ ద్యారా సంప్రదించగలరు.

డిప్లమో ఇన్‌ కంప్యూటర్ ఇంజినీరింగ్‌ (DCME)

“ఉద్యోగ అవకాశాల సముద్రము”

కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివినవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోకొల్లలు. కంప్యూటర్ ప్రవేశించని, ప్రమేయం లేని వ్యవస్థ, రంగము ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మీదు మిక్కిలి అన్ని రంగాలను ఆక్రమిస్తూ......పూర్తి స్థాయిలో వినియోగయోగ్యంగారూపొందించింది. ఏదైనా పరిస్థితులలో కంప్యూటర్ పరిజ్ఞాన వినియోగానికి విఘాతము కల్గితే సమస్త మానవ జీవనము అల్లకల్లోలము అవుతుంది.

ఎందుకంటే.....విమానయానము, రైలు, రవాణా, పారిశ్రామిక, రక్షణ, అంతరిక్ష పరిశోధన, సమాచార, వినోద మరియు వైద్య రంగాలతో సహా... ఒకటేమిటి...? అన్ని రంగాలు కుప్పకూలిపోతాయి. అందుచేతనే, ఈనాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ అగ్రతాoబూలము అందుకుంటున్నది.

కంప్యూటర్ ఇంజనీరింగ్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ మరియు హార్డువేర్ రెండు రంగాల్లోనూ డిప్లమో కంప్యూటర్స్ చదివిన విద్యార్ధులు రాణిస్తున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ జీతభత్యాల్లో / వేతన సౌకర్యాల్లో ఇతరరంగాలకు చెందిన ఇంజనీర్ల కంటే అధిక ప్రయోజనాల్ని పొందటము జగమెరిగిన సత్యం.

ఏయేసంస్థల్లోఉద్యోగాలు ?

Infosys, Wipro, Accenture, Cognizant,TCS, HCL, Intel, Texas, Mindtree, Tech Mahindra,Deloitte,Amazon,CGI,,Bel, మొదలగు కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొందవచ్చు.

వచ్చేపదేళ్ళలోభారతఐటీరంగభవిష్యత్తు.. వృద్ధిపరంగా, ఉద్యోగాల కల్పనపరంగా బంగారుబాటే : ప్రస్తుతమనదేశఐటీరంగఎగుమతులవిలువషుమారు 154 బిలియన్డాలర్లు (10 లక్షలకోట్లు). 2025 నాటికి 325 - 350 బిలియన్డాలర్లవ్యాపారంజరుగుతుంది. ఇకప్రస్తుతం 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2025 నాటికి మరో 30 - 35 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి విద్యార్ధులు దిగులు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలకు డోకా లేదు. కొత్త సాంకేతికను నేర్చుకోవాలి అంతే!

బ్రాంచ్‌ ‌ మార్పు :

DCME చదివిన డిప్లమో విద్యార్ధులు E-Cet ద్వారా ఇంజనీరింగ్‌ (B.Tech.,) 2వసం||లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు సియెస్ఇ ఇంజనీరింగ్‌ శాఖల్లోఅడ్మిషన్‌ పొందవచ్చు.