డిప్లమో ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ మరియు బిగ్ డేటా. క్లౌడ్ కంప్యూటింగ్ మరియు బిగ్ డేటా కోర్స్ అనేది డేటా అనలిటిక్స్ మరియు వినియోగదారుని అవసరములను తీర్చే అత్యంత ప్రాముఖ్యత కలిగిన, ప్రస్తుత సాఫ్ట్ వేర్ లేదా అనువర్తనాలను రూపొందించడానికి ఈ కోర్స్ సహాయ పడుతుంది.
కంప్యూటర్ సైన్స్ నందు ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ పరిష్కారాలను అర్ధం చేసుకోవడానికి, విశ్లేషించడానికి మరియు అభివృద్ది చేయగల సామర్ధ్యం ఈ కోర్స్ విశిష్టత. కంపెనీలు తమ సేవలను మెరుగుపరచడానికి, వారి వ్యాపార నమూనాలను అంచనా వేయడానికి, నిర్ణయాత్మక ప్రక్రియను మెరుగుపరచడానికి క్లౌడ్ కంప్యూటింగ్ మరియు బిగ్ డేటాసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి.
రక్షణ రంగం, లాజిస్టిక్స్ , వ్యవసాయం, బ్యాంకింగ్, ఇ-కామర్స్ వంటి రంగాల్లో,బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, డేటా సైంటిస్ట్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్,సాఫ్ట్ వేర్ డెవలపర్స్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు కలవు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, గూగుల్, ఫేస్ బుక్, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (బిబిఎం), ఇన్ఫోసిస్ లిమిటెడ్,IBM క్లౌడ్ ,ఆలీబాబా,లెనోవా గ్రూప్ లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్, హెచ్ సి యల్ టెక్నాలజీస్, విప్రో ఎంటర్ ప్రైజెస్ , మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, అమెజాన్ గ్రూప్, ఫ్లిప్ కార్ట్ మొదలగు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కలవు.
DCCBD చదివిన డిప్లమో విద్యార్ధులు E-Cetద్వారా ఇంజనీరింగ్ (B.Tech.,) 2వసం||లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , AIML మరియు సియెస్ఇ ఇంజనీరింగ్ శాఖల్లోఅడ్మిషన్ పొందవచ్చు.