Welcome to JPKP: 2021-22::విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి.

బాయ్స్‌ క్యాంపస్‌ హాస్టల్‌

 • రోజూ ఇంటి నుండి కాలేజీకి రాకపోకలు సాగించే వీలు లేని విద్యార్ధులకు హాస్టల్‌ వసతి చాలా ముఖ్యం. అలాగే ఏ రోజూ పాఠ్యాంశాలు ఆ రోజే చదివి, అవగాహన చేసుకోవాలనుకునే విద్యార్ధులకు హాస్టల్‌ వసతి ఓ వరం.
 • పాఠ్యాంశాలు బోధించే మా లెక్చరర్స్‌చే రోజుకు 4 గంటలు ఉచితంగా స్టడీ అవర్స్‌ నిర్వహించబడును.
 • విశాలవంతమైన వసతి సౌకర్యము.
 • ఉదయం టిఫిన్‌ మరియు రెండు పూటలు భోజనము.
 • 24 గంటలు కరెంటు మరియు నీటి సౌకర్యము.
 • అదనపు చార్జీలు వసూలు చేయబడవు.
 

నియమ నిబంధనలు

 • నగదు రు.100/- కంటే ఎక్కువ కల్గి ఉండకూడదు.
 • సెల్‌ ఫోన్ల వలన అనేక అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుచున్నవి. హాస్టల్‌లో సెల్‌ఫోన్లు కల్గిఉండకపోవటమే శ్రేయస్కరము.
 • ఎవరైనా విద్యార్ధి మా అనుమతి లేకుండా సెల్‌ఫోన్లు తెచ్చి పొగొట్టుకుని లేదా మరే ఇతర కారణము చేతనైనా వాతావరణాన్ని కలుషితము చేసినట్లయితే సదరు విద్యార్ధిని హాస్టల్‌ నుండి పంపివేయబడును.
 • ఐరన్‌ బాక్సులు, వాటర్‌ హీటర్స్‌ మరియు ఏ రకమైన ఎలక్ట్రికల్‌ మరియు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు కలిగి ఉన్నచో రు.500/- అపరాధ రుసుము విధింపబడును.
 • బిల్‌ సకాలములో చెల్లించుటలో విఫలమైన విద్యార్ధులకు హాస్టల్‌ సౌకర్యము లభించదు.
 • ఎట్టి పరిస్థితులలో పాకెట్‌ మనీ లేదా ఖర్చుల కోసము డబ్బు ఇవ్వబడదు.
 • హాస్టల్‌ విద్యార్ధులు ఖచ్చితంగా సామాజిక మర్యాదలు పటించవలెను. ఒకరినొకరు గౌరవించుకుని ఇతరుల పట్ల సంస్కారవంతమైన ప్రవర్తన కల్గి ఉండవలెను. అనాగరిక భాష, చేష్టలు ప్రదర్శించే వారు హాస్టల్‌ నుండ వేలివేయబడుదురు.
 • ఇతరుల వస్తువుల పట్ల వ్యామోహముతో అనుమానస్పదంగా వ్యవహరించిన వారిని హాస్టల్‌ నుండి తొలగించబడును.
 • బాత్‌ రూమ్స్‌, లెట్రిన్స్‌ ఉపయోగించిన తరువాత ఎక్కువ నీరు పోసి పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి.
 • హాస్టల్‌కు సంబంధించిన ఫర్నీచర్‌, సామాగ్రి మొదలగు వాటికి ఏ విధమైన నష్టం కల్గించరాదు. నష్టపరిహారం సదరు విద్యార్ధి నుండే వసూలు చేయబడును.
 • మెస్‌ నందు భోజన పద్దతులు మర్యాదలు పాటించవలెను.
 • రాత్రి సమయములందు అత్యంత క్రమశిక్షణతో మెలగి స్టడీ అవర్‌ పూర్తి కాగానే నిద్రపోవలెను. సహవిద్యార్ధులకు ఇబ్బంది కలిగే రీతిలో ప్రవర్తించరాదు.
 • హాస్టల్‌ నందు బిగ్గరగా మాట్లాడరాదు మరియు వరండాల్లో పరిగెత్తరాదు.
 • ఎవరికి సంబంధించిన వస్తువులు మరియు సామాగ్రిని వారే సంరక్షించుకొనవలెను. అజాగ్రత్తగా,నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు.
 • గ్రూపులు, ముఠాలు కట్టరాదు.
 • అసహజ, అభ్యంతరకర ప్రవర్తన కల్గి ఉండరాదు.
 • కాలేజి లేదా మెస్‌ సిబ్బందితో ఆర్థిక లావాదేవీలు కల్గి ఉండరాదు.
 • సినిమాలు, క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి అభ్యంతర విషయాల్లో పాల్గొనరాదు.
 • అదే విధంగా విద్యార్ధులు కూడా పరస్పరం ఆర్థిక లావాదేవీలు, సెల్‌ఫోన్‌ కొనుగోళ్ళు, అమ్మకాలు, రిపేర్లు, ATM కార్డులు వాడకాలు, ATM కార్డ్‌ పాస్‌ వర్డ్స్‌ తెలియజేయటం వంటి విషయాలు నిషేధితం.
 • STUDY HOUR TIMMINGS ను తు.చ తప్పక పాటించవలెను.
 • తల్లిదండ్రుల అంగీకారము తెలిపిననూ వార్డెన్‌ మరియు ప్రిన్సిపల్‌ అనుమతి లేనిదే బైటకు వెళ్ళరాదు.
 • ర్యాగింగ్‌ చట్టరిత్యా నేరము, మరియు నిషేధితం, అతిక్రమించిన వారు చట్టరీత్యా శిక్షార్హులు.
 • Day-Scholars ను హాస్టల్‌కు తీసుకురాకూడదు.
 • గట్టి బందోబస్తు గొళ్ళెం కల్గి ఉన్న ట్రంకు పెట్టె తప్పనిసరి.
 • నగదుగా డబ్బు కలిగి ఉండరాదు.
 • బిల్లులు తమ సొంత బ్యాంక్‌ ఎకౌంట్‌నకు జమచేసుకొనవలెను.
 • అభ్యంతర సాహిత్యము, నవలలు, సినిమా పత్రికలు, సినిమా నటీనటులు మరియు ఆటగాళ్ళ చిత్రాలు కలిగి ఉండరాదు మరియు నిషేదము.
 • నిక్కర్లు మరియు 3/4 ప్యాంట్స్‌ ధరించి హాస్టల్‌ ఫ్లోర్‌ దిగి క్రిందికి రాకూడదు.
 • వరండాలో బిగ్గరగా మాట్లాడరాదు.
 • స్తులు కేటాయించిన / సూచించిన ప్రదేశములో మాత్రమే ఉతకవలెను.
 • Birthday Parties నిషేధము.
 • హాస్టల్‌ నందు నివశించు విద్యార్ధులు బైట నుండి ఆహార పదార్ధాలు తెచ్చుకుని హాస్టల్‌ నందు భుజించుట నిషేధము. డైనింగ్‌ హాల్‌ నందు భుజించవలెను. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారము కూడా డైనింగ్‌ హాల్‌ నందే భుజించవలెను.
 • అనారోగ్యము ఉన్న విద్యార్ధులు విశ్రాంతి గది (Sick Room) నందు విశ్రాంతి తీసుకొనవలెను.
 • అల్పాహారం/భోజనము రూమ్‌ వద్దకు తీసుకుపోవుటకు అనుమతిలేదు.
 

ఆహారము

టిఫిన్‌ (పరిమితం) : వారములో మూడు రోజులు : ఇడ్లీ (4 చొప్పున), ఒకరోజు : పునుగు (4 చొప్పున), రెండు రోజులు : పులిహోర, ఒకసారి : వెజిటబుల్‌ ఫ్రైడ్‌ రైస్‌.

ప్రతిరోజు ఉదయము రాగుల జావ అందజేయబడును.

భోజనము (మధ్యాహ్నం, రాత్రి) : B.P.T రైస్‌తో ఒక కూర, సాంబారు మరియు పెరుగుతో రుచి, శుచికల్గిన సంపూర్ణమైన భోజనము.

చికెన్‌ : ప్రతి ఆదివారం సరఫరా చేయబడును.

శాఖాహారులకు ఆదివారము : రోజువారీ మాదిరే వడ్డించబడును.