2020-21 విద్యా సంవత్సరానికి సీటు కొరకు నేరుగా లేదా ఫోన్ ద్యారా సంప్రదించగలరు.

డిప్లమో ఇన్ ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ (DAE)

అరుదైన కోర్సు - మెరుగైన అవకాశాలు

 

A.P లో కేవలము 18 పాలిటెక్నిక్‌ కాలేజ్‌ల్లో మాత్రమే ఈ కోర్సు ఉన్నది. ఏటా లభించే సీట్లు : 1190 మాత్రమే.

భారతదేశములో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ ఏటా 15.9% వృద్ధిరేటు సాధిస్తోంది. (Source: ibef.org)

ఆటోమొబైల్‌ డిప్లమో చదివిన విద్యార్ధులు ఇంజనీరింగ్‌ 2వ సం||లోనికి నేరుగా అడ్మిషన్‌ పొందవచ్చును.

ఆటోమొబైల్‌ డిప్లమో చదివిన విద్యార్ధులు ఇంజనీరింగ్‌లో - ఆటోమొబైల్‌, మెకానికల్‌, మెకానికల్‌ మెరైన్‌, మెకట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌, ఏరోనాటికల్‌, ఏరోస్పెస్‌ మరియు ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ వంటి 8 బ్రాంచ్‌లలో ప్రవేశము పొందటానికి అవకాశము వుంది.

AMVI (Brake Inspector) పోస్టుకు కేవలము DAE విద్యార్థులు మాత్రమే అర్హులు.

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ భావనలు, సూత్రాల అనువర్తన మరియు పునాదుల మీద రూపకల్పన చేయబడిన ప్రత్యేక ఇంజనీరింగ్‌ కోర్సు.

రవాణా, ప్రజా రవాణా, రక్షణ, వ్యవసాయము, మట్టిపని మరియు నిర్మాణ రంగాలకు చెందిన వాహనాల తయారీ, ఇంజన్లు, డిజైనింగ్‌, సేల్స్‌ మరియు సర్వీసు వంటివి ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ శాఖ పరిధిలోకి వస్తాయి.

సాంప్రదాయ ఇంధన చోదిత వాహనాలు (డీజిల్‌, పెట్రోలు),  సోలార్‌ & ఎలక్ట్రికల్‌ వాహనాలు రూపొందించటంలో ఆటోమొబైల్‌ పరిశ్రమదే కీలక పాత్ర.

మానవ రహిత, స్వయంచోదక, ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ వంటి సరికొత్త డిజైన్లతో ఈ రంగం నూతన ఆవిష్కరణలకు వేదిక.

ఉద్యోగాల కల్పనలో ఈ రంగానిదే పై చేయి.

APSRTC, Indian Railways, Fleet Owners, DRDO, DRDL, Hero, Bajaj, Hyundai, Honda, VolksWagen, Ashok Leyland, Kia, Mahindra, Isuzu అనేక బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు వెల్లువెత్తు చున్నవి.

భారతదేశములో ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ మరియు అనుబంధ పరిశ్రమలు షుమారు 500 పైగా ఉన్నవి.

 

స్వయం ఉపాధి / ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా అవకాశాలు

ఆటోమొబైల్‌ సర్వీస్‌ సెంటర్స్‌, లాస్‌ ఎసెస్‌ర్స్‌ (Vehicle Insurance Surveyors) అనుబంధ పరిశ్రమల స్ధాపనతో స్వీయ ఆర్జనతోపాటు పలువురికి ఉపాధి కల్పించవచ్చు.